సూర్యపేటలో బయటపడ్డ అరుదైన బుద్ధ విగ్రహం..

285
Minister Srinivas Goud
- Advertisement -

దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా వెలుగు చూడని బుద్దుడిదిగా భావిస్తున్న భారీ గార ప్రతిమ (డంగు సున్నంతో రూపోందించిన) సూర్యపేట జిల్లాలోని ప్రముఖ బౌద్ద స్తూప క్రేంద్రమైన ఫణిగిరిలో వెలుగుచూసింది. ఫణిగిరి బౌద్ద స్తూపం ప్రాంగణంలో గత రెండు మూడు నెలలుగా కేంద్ర పురావస్తూ శాఖ అనుమతితో రాష్ట్ర పురావస్తూ శాఖ తవ్వకాలను ప్రారంభించింది. ఈ తవ్వకాలలో ఆరు అడుగుల అద్బుత భారీ ప్రతిమ బయల్పడింది. ఈ భారీ ప్రతిమను హైదరాబాద్ లోని పురావస్తూ శాఖ కార్యలయంలోని మ్యూజియంలో పురావస్తూ శాఖ ఇంచార్జీ డైరెక్టర్ సునితా భగవత్ అద్వర్యంలో భద్రపరిచారు. మ్యూజియంలో భద్రపరచి ఉన్న బుద్దని ప్రతిమను రాష్ట్ర అబ్కారి,పర్యాటక, సాంస్కృతిక మరియు పురావస్తూ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు.

ఈ సందర్శంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి ఎంతో చరిత్ర ఉందన్నారు. ఆది మానవుని అవశేషాలు మన రాష్ట్రంలో చాలా చోట్ల వెలుగు చూశాయన్నారు. చారిత్రకంగా తెలంగాణ రాష్ట్రం ఎంతో పురాతన చరిత్ర కల్గియుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ అందించిన ప్రోత్సాహంతో పురావస్తూ శాఖ తెలంగాణ లోని పలు చారిత్రక ప్రాంతాలలో తవ్వకాలు జరిపి చరిత్ర అవశేషాలను వెలికితీయటం అభినందనీయమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. బౌద్ద క్షేత్రమైన ఫణిగిరిలో లభ్యమైన ప్రతిమ ఎంతో అమూల్యమైందన్నారు.

Minister Srinivas Goud

దేశంలో ఇప్పటివరకు రెండు అడుగుల పరిమాణంలో ఉండే సున్నం ప్రతిమలు లభించాయన్నారు. ఇలాంటి ప్రతిమ తోలిసారిగా అరు అడుగుల పోడవుతో సహజంగా డంగు సున్నంతో రూపోందించిన ప్రతిమ లబించటం వల్ల క్రీస్తూ పూర్యం 1వ శతాబ్దానికి చెందినట్లుగా బావిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

అరుదైన బుద్దుడి ప్రతిమను ఎంతో జాగ్రత్తగా సంరక్షించాలని మంత్రి పురావస్తూ అధికారులను అదేశించారు. వెలికి తీసిన సమయంలో భూగర్బంలో ఉండిపోయిన ముక్కలను తిరిగి సేకరించి వాటిని పూర్వపు పద్దతిలో డంగు సున్నం మిశ్రమంతో అతికించి భద్రపరచాలని మంత్రి కోరారు. అందుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో  ప్రముఖ బౌద్ద క్షేత్రాలలో తవ్వకాలు జరిపేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకేల్లి త్వరగా అనుమతులు లబించేవిధంగా చర్యలు చేపడుతామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో బుద్దవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, ఇంచార్జీ డైరెక్టర్ సునితా భగవత్, అసిస్టేంట్ డైరెక్టర్లు నారాయణ, మాదవిలు పాల్గోన్నారు.

- Advertisement -