హీరో సూర్య 5 కోట్ల విరాళం!

172
suriya

కోలీవుడ్ నటుడు,హీరో సూర్య తన పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు తనవంతుగా రూ. 5 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు.

సినీ పరిశ్రమ నమ్ముకుని ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయని అలాంటి వారు కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు సూర్య. ఈ కష్ట కాలంలో ఎంతోమంది నాకు అండగా నిలిచారు…వారికి తనవంతు సాయం అందించానని వెల్లడించారు.

కరోనా నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్‌లో కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ)ని ఏర్పాటు చేసి సాయం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 10 వేల మంది సినీ కార్మికులకు సాయం చేయగా తాజాగా మూడో విడత సాయం అందించేందుకు సిద్ధమవుతున్నారు.