మొక్కలు నాటిన దర్శకుడు శివ నిర్వాణ..

156
shiva nirvana

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తాము సైతం అంటూ మొక్కలను నాటి ఈ కార్యక్రమంలో బాగస్వాములవుతున్నారు.

ఈ రోజు ప్రముఖ డైరెక్టర్ శివ నిర్వాణ జూబ్లీహిల్స్ లో మూడు మొక్కలను నాటి ఫిల్మ్ డైరెక్టర్స్ సందీప్ వంగ, సుదీర్ వర్మ తో పాటు ప్రొడ్యూసర్స్ హరీష్ పెద్ది, సాహు గారపాటి లను ఈ కార్యక్రమానికి నామినేట్ చేశారు. సామాజిక దృక్పధంతో ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి ఈ సందర్బంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.