గ్రీన్ ఛాలెంజ్…మొక్కలునాటిన ఓవైసీ

114
owaisi

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు విశేష స్పందన వస్తోంది. పలువురు సినీ,క్రీడా,రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొనగా ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

తాజాగా గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి తాను మొక్కలు నాటానని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ఓవైసీ పిలుపునిచ్చారు.

టాలీవుడ్,కోలీవుడ్,బాలీవుడ్‌తో పాటు జాతీయ పార్టీల నాయకులు గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటుతుండటంతో ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది గ్రీన్ ఛాలెంజ్‌.