హీరో సూర్య బర్త్‌ డేకు సర్‌ప్రైజ్‌..

115
- Advertisement -

తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ కూడా సూర్య సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. కెరియర్ పరంగా సూర్యకి ఇది 40వ సినిమా. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.

అయితే ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ను ఎనౌన్స్ చేయలేదు .. ఫస్టులుక్ ను వదల్లేదు. దర్శకుడిగా పాండిరాజ్ కి మంచి ఇమేజ్ ఉంది .. ఇక హీరోగా సూర్యకి గల క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందువలన సహజంగానే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. ఈ నెల 23వ తేదీన సూర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను వదలనున్నారని సమాచారం.

- Advertisement -