కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు..

200
koppula

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యాద్ సఖీల్ మాజీ మార్కెట్ డైరెక్టర్, సైక్ ఖాళీద్ మైనారిటీ మండల అధ్యక్షులు, సయ్యాద్ ఇస్మాయిల్, సయ్యాద్ జావీద్,సైక్ రఫీక్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటిసి గొస్కుల జలేంధర్, MPP నక్క శంకర్, PACS ఛైర్మన్ మాధవ రావు, తెరాస మండల పార్టీ అధ్యక్షులు బొల్లం రమేష్, తెరాస విద్యార్థి విభాగ నాయకులు పాదం తిరుపతి, పాదం రమేష్, మరియు పలువురు తెరాస ముఖ్య నాయకులు పాల్గొన్నారు.