సర్జరీ తర్వాత నా ముఖం చూస్తే…

43
- Advertisement -

సినీలోకం ఒక అందమైన రంగుల లోకం అందులో తారలు అందంగా కనిపించడం కోసం  ఎంతో కష్టపడుతుంటారు. ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీలు లాంటి చేసుకొనేందుకు ముందుకు వస్తారు.  ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే తాజాగా బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా గతంలో తన ముక్కుకు సంబంధించి శస్త్రచికిత్స చేయించుకున్నట్టు తన ఆటోబయోగ్రఫిలో రాసుకొచ్చింది. ప్రియాంక చోప్రాజోనాస్:ఆన్‌ఫినిషడ్‌ మెమోర్‌ అనే పుస్తకంలో ఈవిషయాన్ని రాసింది.

నా ముక్కుకు సర్జరీ చేయించుకున్న తర్వాత దాని ఆకారం పూర్తిగా మారిపోయింది. బ్యాండేజ్‌ తీయగానే నేను మా అమ్మ బాగా భయపడిపోయాం. నాముఖం మరోలా కనిపించింది. అద్ధంలో చూసినప్పుడు ఎవరినో చూస్తోన్న అనే భావన కలిగింది. ఎంతో నిరాశకు గురయ్యాను. కానీ తిరిగి మాములు స్థితికి రావాడానికి చాలా కాలం పట్టింది. అయితే నేను మాములు స్థితిలోకి కోలుకుంటానని అస్సలు అనుకోలేదు. అని ప్రియాంక చోప్రా తన ఆటోబయోగ్రఫీలో రాసుకొచ్చింది. ప్రియాంక 2000వ సంవత్సరంలో మిస్‌ వరల్డ్‌గా కిరీటాన్ని సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి…

ఎన్టీఆర్‌..రెడ్‌కార్పెట్‌పై మేం కాదు భారతీయులు…

ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌ పై కొత్త ముచ్చట్లు

పుష్ప 2లో లేను.. మీటూ పై స్పందన ఇదే

- Advertisement -