ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌ పై కొత్త ముచ్చట్లు

64
rrr
- Advertisement -

ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఆస్కార్‌ వేడుకకు హాజరయ్యేందుకు అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. లాస్‌ ఏంజిల్స్‌ ఆయన మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆస్కార్ వేదికపై డాన్స్ చేసే విషయంపై స్పందించారు. ‘నాటు నాటు’ పాటను లైవ్‌లో చూడాలని ఆసక్తిగా ఉన్నాను. ఈ పాటకు డ్యాన్స్‌ వేస్తామని కచ్చితంగా చెప్పలేను. మాకు ప్రాక్టిస్ చేసే సమయం లేదు. అందుకే వేదికపై డ్యాన్స్‌ చేయలేకపోతున్నాం అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. ఇది ఇలా ఉంటే.. మరోపక్క RRR యూనిట్‌పై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

”ఆస్కార్ అవార్డు కోసం ఆర్ఆర్ఆర్ యూనిట్ రూ.80 కోట్లు ఖర్చు పెట్టింది. అదే డబ్బుతో మేం 8-10 సినిమాలు తీసేవాళ్లం. కేవలం వారు ఫ్లైట్‌ టికెట్ల కోసమే కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ మాట్లాడుకోవటం కూడా టైమ్ వేస్ట్ అంటూ” ఓ మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఘాటుగా స్పందించారు.

తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తున్న పేరును చూసి గర్వపడాలని రాఘవేంద్రరావు సూచించారు. అంతేకానీ, 80 కోట్లు ఖర్చు అనడం సరికాదని, నీ దగ్గర ఏదైనా అకౌంట్స్ ఇన్ఫర్మే షన్ ఉందా? అంటూ తమ్మారెడ్డిని ప్రశ్నించారు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా నీ యమ్మ మొగుడు ఖర్చు పెట్టాడా అంటూ త‌మ్మారెడ్డికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన సంగతి తెలిసింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -