రైనా ఇన్‌.. యువీ ఔట్‌

207
first three ODIs
first three ODIs
- Advertisement -

న్యూజిలాండ్ తో జరగనున్న తొలి మూడు వన్డేలకు భారత జట్టును ప్రకటించారు. తొలిసారి బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెస్కే ప్రసాద్‌ జట్టు ఎంపికలో సీనియర్‌, జూనియర్ల కలయికతో తనదైన ముద్ర వేశారు. భారత్‌ జట్టు మొత్తం ఐదు వన్డేలు ఆడాల్సి ఉండగా.. తొలి మూడు వన్డేలకు 16 మందితో కూడిన జట్టును ప్రకటించారు.

selection-committee

దులీప్‌ ట్రోఫీతో ఫామ్‌లోకి వచ్చిన రైనాపై సెలక్టర్లు మళ్లీ నమ్మకం ఉంచారు. తాజాగా టెస్టు సిరీస్‌లో గాయపడిన శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, భువనేశ్వర్‌ కుమార్‌లతో పాటు సీనియర్‌ పేసర్లు ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ, స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఇటీవల ఆస్ట్రేలియాలో మెరుగ్గా రాణించిన భారత్‌-ఎ జట్టు యువ క్రికెటర్‌ మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్య తదితరులకి జట్టులో అవకాశమిచ్చిన సెలక్టర్ల బృందం.. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌కి అవకాశం ఇవ్వలేదు.

వన్డే జట్టు ఇదే.. మహేంద్రసింగ్‌ ధోని (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, అజింక్య రహానె, విరాట్‌ కోహ్లి, మనీశ్‌ పాండే, సురేశ్‌ రైనా, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, జయంత్‌ యాదవ్‌, అమిత్‌ మిశ్రా, జస్‌ప్రీత్‌ బుమ్రా, ధవళ్‌ కులకర్ణి, ఉమేశ్‌ యాదవ్‌, మన్‌దీప్‌ సింగ్‌, కేదార్‌ జాదవ్‌.. అక్టోబరు 16 నుంచి వన్డే సిరీస్‌ మొదలవుతుంది. చివరి రెండు వన్డేలకు జట్టును సిరీస్‌ మధ్యలో మ్యాచ్‌ ఫలితాల ఆధారంగా ప్రకటించే అవకాశముంది. కాగా టెస్టు సిరీస్‌లో చివరి టెస్టు మ్యాచ్‌ శనివారం ఆరంభంకానుంది.

- Advertisement -