బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో ఢిల్లీ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా. బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో నోటీసులు అందుకున్న అనంతరం ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయానికి హాజరయ్యారు.
కేంద్ర దర్యాప్తు సంస్థ ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది. ఈ దర్యాప్తు ‘అక్రమ’ బెట్టింగ్ యాప్ 1xBetకు సంబంధించి కొనసాగుతుందని పీటీఐ వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు రానా ఆగస్టు 11న ED ఎదుట హాజరయ్యారు. జూలై 23న విచారణకు పిలిచినా, అప్పటి షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఆయన వాయిదా కోరగా, తరువాత హైదరాబాద్ జోన్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. తెలంగాణ పోలీసులు 25 మంది ప్రముఖ సినీ తారలు మరియు డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్లపై FIR నమోదు చేశారు. ఇందులో రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మాంచు లక్ష్మి వంటి వారు ఉన్నారు.
హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో మార్చి 19న 32 ఏళ్ల వ్యాపారవేత్త పీఎం ఫణీంద్ర శర్మ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.
Also Read:KTR:కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవండి
#WATCH | Former Indian Cricketer Suresh Raina reaches ED office in Delhi to record his statement in 1xBet case following summons by the agency. pic.twitter.com/wJAw1gACt5
— ANI (@ANI) August 13, 2025

