- Advertisement -
హైదరాబాద్ వాసులకు హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.హైదరాబాద్, మేడ్చల్, సైబరాబాద్ పరిధిలో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ముందస్తుగా నిన్ననే హెచ్చరించింది హైడ్రా.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 15 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది హైడ్రా.
వర్షాభావ పరిస్థితుల్లో సాయం కోసం ఇప్పటికే హైడ్రా DRF బృందాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు కమిషనర్ రంగనాథ్.
Also Read:KTR:కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవండి

- Advertisement -

