కరోనాతో కేంద్రమంత్రి సురేశ్ అంగడి మృతి..

113
suresh angadi

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు దేశంలో 46 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా తాజాగా కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సురేశ్ అంగడి(65)కన్నుమూశారు.

రెండు వారాల క్రితం కరోనాతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఆయన పరిస్ధితి విషమించి బుధవారం రాత్రి కన్నుయూశారు. బెలగావి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా సురేశ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బెలగావి నుంచి ఆయన నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

సురేశ్ అంగడి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఎంపీగా,మంత్రిగా నిబద్దతతో పనిచేశారని కర్ణాటకలో పార్టీ బలోపేతానికి కృషిచేశారని తెలిపారు. ఇక దేశంలో ఇప్పటివరకు కరోనాతో ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ప్రాణాలు కోల్పోయారు.