కేకేఆర్‌ పై ముంబై ఘన విజయం

140
rohtith

ఐపీఎల్ 2020లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కోల్ కతా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ముంబై విధించిన భారీ టార్గెట్‌ 196ను చేధించే క్రమంలో 9 వికెట్లు కొల్పోయి 146 పరుగులకే పరిమితమైంది కేకేఆర్. దీంతో 49 పరుగుల తేడాతో గెలిచి తొలివిజయాన్ని అందుకుంది ముంబై.

భారీ లక్ష్యచేధనతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. శుబ్‌మన్‌ గిల్‌(7), సునీల్‌ నరైన్‌(9) వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టగా తర్వాత కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌(30), నితీష్‌ రాణా(24)లు 46 పరుగులు భాగస్వామ్యాన్ని సాధించారు.కార్తీక్ ఔటైన వెంటనే రసెల్‌(11), మోర్గాన్‌(16)లు పెవిలియన్ బాట పట్టగా చివర్లో కమిన్స్‌(33) మెరుపులు మెరిపించిన ఫలితం లేకపోయింది.

అంతకముందు టాస్ గెలిచిన కేకేఆర్ …ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రెండో ఓవర్‌లోనే డికాక్ (1) పెవలియన్ బాటపట్టడంతో ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే పనిని భుజానికెత్తుకన్నారు రోహిత్- సూర్యకుమార్. రెండో వికెట్‌కు 90 పరుగులు జోడించాక సూర్యకుమార్‌ 47 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే రోహిత్ శర్మ 54 బంతుల్లో 80 పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 195 పరుగులు చేసింది.