వివాదంలో సైరా సురేందర్ రెడ్డి..!

418
surenderreddy

మెగాస్టార్ చిరంజీవితో సైరా వంటి ప్రతిష్టాత్మక సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టిసారించిన సురేందర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేరాఫ్‌గా మారాయి.

అతనొక్కడే సినిమాతో టాలీవుడ్‌లో దర్శకుడిగా ఆరంగేట్రం చేశాడు సురేందర్ రెడ్డి. ఇక ప్రభాస్‌తో తనకున్న అనుబంధాన్ని చెబుతూనే రెండో సినిమా అశోక్…జూనియర్ ఎన్టీఆర్‌తో ఎందుకు తీయాల్సి వచ్చిందో వివరించి ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేశాడు.

అతనొక్కడే తర్వాత 2006లో ప్రభాస్‌ హీరోగా సినిమా చేసే ఛాన్స్ దక్కిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన కథ అన్ని సిద్ధం అయ్యాయని కానీ ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మేనేజన్ సుకుమార్ తనని కలిసి ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ఒప్పించాడని తెలిపారు. ఎన్టీఆర్ వరుస ఫ్లాప్‌లతో ఉండటంతో తాను సినిమా చేయడానికి ఒప్పుకున్నానని చెప్పాడు. దీంతో ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశాన్ని కొల్పోయానని చెప్పుకొచ్చాడు.

అంతే దర్శకుడు సురేందర్ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌. సైరా దర్శకుడికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలెట్టారు. అయితే ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమా చేసేందుకు కసరత్తు చేస్తున్న సురేందర్ రెడ్డి….ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని ఎలా కూల్ చేస్తారో వేచిచూడాలి.

Director Surender Reddy who is basking in the glory of ‘Sye Raa’ is in the thick of controversy as his latest video interview went viral