హైదరాబాద్ రౌడీలపై వర్మ సినిమా

443
Rgv

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా తెరెక్కిస్తున్నారు. ఇటివలే ఈసినిమా షూటింగ్ పూర్తికాగా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాగా విడుదలకు ముందే ఈమూవీ సంచలనంగా మారింది. ఏపీలో ప్రస్తుత రాజకీయాలపై ఈసినిమాను తెరకెక్కించారు. ఇక తాజాగా తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

విజయవాడ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అయిపోయారని… ఇప్పుడు హైదరాబాద్ దాదాగిరిపై సినిమా తీయబోతున్నానని తెలిపాడు. 1980లలో హైదరాబాదులో నెలకొన్న దాదాగిరి, దాదాలపై ఈ సినిమా ఉంటుందని చెప్పాడు. ఈ సినిమా ఓ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఆధారంగా తెరకెక్కబోతోందని… ఈ చిత్రానికి ‘శివ’ సినిమానే స్ఫూర్తి అని తెలిపాడు. ఈసినిమాలో జార్జ్ రెడ్డి ఫేమ్ సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో నటించనున్నాడని తెలిపాడు. ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తర్వలోనే తెలియనున్నాయి.

Director Ram Gopal Varma Next Movie is hyderabad Rowdys