సురేఖా వాణిని ఇబ్బంది పెడుతున్నారు

61
- Advertisement -

నటి సురేఖా వాణి అంటే చాలా మందికి క్రేజ్ ఉంది. సహజంగా బాగా నచ్చిన హీరో, హీరోయిన్ ఫోన్ నంబర్ కావాలని, వారికి ఫోన్ చెయ్యాలని తహ తహలాడుతుంటారు అభిమానులు. ఎవరి దగ్గరినో సంపాదించి సెలెబ్రిటీలకు ఫోన్లు చేసే వారి సంఖ్య ఎక్కువే. అందుకే, సెలెబ్రిటీలు తమ మొబైల్ లో ఫీడ్ అయిన నంబర్లను తప్ప మిగతా వాటిని అస్సలు పట్టించుకోరు. ముఖ్యంగా సురేఖా వాణి కూడా ఇలాంటి కాల్స్ కి దూరంగా ఉంటుంది. ఐతే, డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ నిర్మాత కేపీ చౌదరి కేసులో సురేఖా వాణి పేరు కూడా బయటకు వచ్చింది.

ఈ క్రమంలో సురేఖా వాణి నంబర్ బయటకు పొక్కింది. ఇక అందాల ఆంటీ నంబర్ దొరికితే కుర్రాళ్ళు ఊరుకుంటారా? అదే సమస్య ఎదుర్కొంటున్నాను అంటోంది సురేఖా వాణి. ఈ డ్రగ్స్ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ, నిర్మాత కేపీ చౌదరి కేసులో నా పేరు వచ్చింది. దీనిపై ఇప్పటికే నేను క్లారిటీ ఇచ్చాను. అయినప్పటికీ, నన్ను ఈ కేసులో లాగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో నా ఫోన్ నంబర్ కూడా లీక్ అయింది.

Also Read: పవన్ ‘బ్రో’కి ఇబ్బందులు తప్పవా?

నా నెంబర్ లీక్ అయినప్పటి నుంచి నాకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. ప్రతి సెకండ్ కి ఒక కాల్ వస్తోంది. ఎవరు పడితే వాళ్ళు నాకు ఫోన్ చేసి చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. నాతో నీచంగా మాట్లాడుతున్నారు. ఇక ఈ ఫోన్ వాడలేను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ సురేఖా వాణి మొత్తానికి రిక్వెస్ట్ చేసుకుంటుంది.

Also Read: శ్రీలీల లవ్ కి బ్ర‌హ్మానందం హెల్ప్

- Advertisement -