పవన్ ‘బ్రో’కి ఇబ్బందులు తప్పవా?

40
- Advertisement -

ఏపీలో వారాహి యాత్ర చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వల్ప అనారోగ్యానికి గురై యాత్రకు కొంత విరామం తీసుకున్నారు. అయితే, జ్వరం ఉన్నా కూడా ‘బ్రో’ మూవీ టీజర్ కోసం పవన్ డబ్బింగ్ చెప్పారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలోనే ఇది జరిగింది. దీంతో మేకర్స్ ఈ సినిమా టీజ‌ర్ అప్డేట్‌ ను మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. ఈ రోజు సాయంత్రం 5.04 గం.ల‌కు బ్రో టీజ‌ర్‌ను రిలీజ్ చేస్తున్నారు.

అయితే, ఈ టీజర్ పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్స్ ఈ టీజర్ లో హైలైట్ అవుతాయట. తాను ఉన్నదే తనను నమ్ముకున్న వాళ్ల కోసం అని అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుందట. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే పవన్ చేత కొన్ని డైలాగ్ లను చెప్పిస్తునట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికే పవన్ కళ్యాణ్ పై వ్యతిరేకంగా ఉన్న ఏపి ప్రభుత్వం బ్రో టీజర్ పై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Also Read:సాయిచంద్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్..

ఆల్ రెడీ జగన్ మంత్రులకు మేసేజ్ లు కూడా పాస్ అయ్యాయి. బ్రో సినిమా టీజర్ లో సీఎం జగన్ పై గానీ, ప్రభుత్వం పై గానీ ఎలాంటి వ్యతిరేక డైలాగ్స్ ఉన్నా.. వెంటనే బ్రో సినిమాకి ఇబ్బందులు సృష్టించేలా చర్యలు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జులై 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Also Read:స్విమ్మింగ్ తో ఆ సమస్యలు దూరం..!

- Advertisement -