డ్ర‌గ్స్ వ్యవహారంలో బాలీవుడ్‌ నటుడు అరెస్ట్‌..

145
Actor Armaan Kohli
- Advertisement -

బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి బయటకు వచ్చింది. తాజాగా డ్ర‌గ్స్ కేసులో బాలీవుడ్‌ నటుడు అర్మాన్‌ కోహ్లీ అరెస్ట‌య్యాడు. నిన్న‌ డ్రగ్స్‌ సరఫరదారుడు అజయ్‌ రాజు సింగ్ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులకు చిక్కడంతో అత‌డిని పోలీసులు విచారించారు. లభించిన ప్రాథమిక ఆధారాలతో అర్మాన్‌ కోహ్లీ ఇంటిపై నిన్న అధికారులు దాడి చేయ‌డంతో అక్కడ కొకైన్ లభ్య‌మైంది.

దీంతో అర్మాన్‌ కోహ్లీని కూడా ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయానికి తరలించి విచారించారు. ఈ రోజు ఆయ‌న‌ను అరెస్టు చేశారు. కోర్టుముందు ప్రవేశపెట్టనున్నారు. సల్మాన్‌ ఖాన్‌ నటించిన ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో సినిమాలో అర్మాన్ న‌టించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే, హిందీ బిగ్‌ బాస్‌లోనూ అర్మాన్‌ కోహ్లీ పాల్గొన్నాడు. ఆయ‌న‌కు దక్షిణ అమెరికా దేశాల నుంచి డ్ర‌గ్స్ అందిన‌ట్లు అధికారులు తేల్చారు. ఈ ఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

- Advertisement -