అనంత పద్మనాభస్వామి ఆస్తులపై సుప్రీం కీలకతీర్పు..!

211
supreme court
- Advertisement -

కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయం ఆస్తులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆలయ ఆస్తుల్లో ట్రావెన్ కోర్ రాచ కుటుంబానికి హక్కు ఉన్నట్లు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 2011 జనవరి 31న కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ట్రావెన్ కోర్ రాజవంశీయులు.ఈ కేసులో విచారణ పూర్తి చేసి గతేడాది ఏప్రిల్‌లో తీర్పును రిజర్వ్ చేసిన సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ ఫైనల్ తీర్పు వెల్లడించింది.

ఆల‌య నిర్వ‌హ‌ణ‌పైన కూడా సుప్రీం తీర్పునిచ్చింది. తిరువ‌నంత‌పురం జిల్లా జ‌డ్జి నేతృత్వంలో తాత్కాలిక క‌మిటీని ఏర్పాటు చేసి.. కొత్త క‌మిటీ ఏర్పాటు చేసే వ‌ర‌కు ఆల‌య నిర్వ‌హ‌ణను ఆ క‌మిటీకి అప్ప‌గించాల‌ని కోర్టు ఆదేశించింది.

2011లో సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పద్మనాభస్వామి ఆలయంలో ఉన్న అయిదు నేలమాలిగలను తెలిచారు. ఆ నేలమాలిగల్లో లక్షల కోట్ల సంపద ఉన్నట్లు గుర్తించారు. జ్వలరీ, విగ్రహాలు, ఆయుధాలు, పరికరాలు, నాణాలు ఉన్నట్లు తేల్చారు.

2011లో ట్రావెన్‌కోర్‌ రాజ వంశానికి చెందిన చివరి వ్యక్తి మరణించడంతో.. ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీన్ని వ్యతిరేకిస్తూ మార్తాండ వర్మ కోర్టులో కేసు దాఖలు చేశారు.

- Advertisement -