గున్నా గున్నా మామిడి@ 100 మిలియన్ వ్యూస్

249
raviteja
- Advertisement -

మాస్ మహారాజాగా ప్రేక్షకుల్లో రవితేజకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు కూడా మాస్‌కు తగ్గట్టుగానే ఉంటాయి. ‘కిక్ 2’, ‘బెంగాల్ టైగర్’ సినిమాల తర్వాత విరామం తీసుకుని సరికొత్తగా ‘రాజా ది గ్రేట్’ అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చాడు.

2017 అక్టోబర్ 18న విడుదలైన ఈ సినిమా రవితేజకు బ్రేక్ ఇవ్వగా వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు.కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో గున్న గున్న మామిడి సాంగ్‌కు స్టెప్పులేయని వారుండరూ. తాజాగా ఈ సినిమాలోని సాంగ్‌ 100 మిలియన్ వ్యూస్ సాధించి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ని రిలీజ్ చేసింది.

- Advertisement -