క‌ర్ణాట‌క‌లో యడ్యూర‌ప్ప ప్ర‌భుత్వానికి షాక్…

203
supreme court says very big shocking news to karnataka government
- Advertisement -

సుప్రీంకోర్టులో క‌ర్ణాటక ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప‌కు ఎదురు దెబ్బ త‌గిలింది. య‌డ్యూర‌ప్ప‌ నిన్న సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. శాస‌న‌స‌భ‌లో బ‌ల‌ప‌రీక్ష జ‌రిగే వ‌ర‌కూ ఎటువంటి విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోరాద‌ని యాడ్యూర‌ప్ప‌ను ఆదేశించింది సుప్రీంకోర్టు. నాయ‌కుల‌కు ఎటువంటి ప‌ద‌వులు నియ‌మించ వ‌ద్ద‌ని ఆదేశాలు జారీచేసింది. వెంట‌నే తాత్కాలిక స్పీక‌ర్ ను నియ‌మించాల‌ని తెలిపింది. బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గిన తర్వాతే తదుప‌రి నిర్ణ‌యాలు తీసుకొవాలని సుప్రీం ఆర్డ‌ర్ జారీ చేసింది. రేపు మ‌ద్యాహ్నం 4గంట‌ల‌కు క‌ర్ణాట‌క శాస‌న‌స‌భ‌లో బిజెపి ప్ర‌భుత్వంపై విశ్వాస ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. ఈ విశ్వాస ప‌రీక్ష‌లో బిజెపి నెగ్గితే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి త‌దుప‌రి నిర్ణాయాలు తీసుకొవ‌డానికి  అవ‌కాశం ఉంది.

supreme court says very big shocking news to karnataka government

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు క‌ర్ణాట‌క సీఎం యడ్యూర‌ప్ప‌. విశ్వాస ప‌రీక్ష‌లో త‌మ ప్ర‌భుత్వం త‌ప్ప‌కుండా నెగ్గుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావ‌ల్సిన మెజార్టీ స‌భ్యులు త‌మ‌తో ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. జేడీఎస్ , కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్ లో ఉన్నార‌ని..కాంగ్రెస్ వాళ్లు ఎన్నిప్ర‌య‌త్నాలు చేసినా వాళ్లు త‌మ‌కే మ‌ద్ద‌తు ప‌లుకుతార‌ని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు తాము త‌ప్ప‌కుండా పాటిస్తామ‌ని..న్యాయ‌స్ధానాల‌పై త‌మ ప్ర‌భుత్వానికి ఖ‌చ్చిత‌మైన న‌మ్మ‌కం ఉంద‌న్నారు. రేపు జ‌ర‌గ‌బోయే విశ్వాస ప‌రీక్ష‌లోత‌మ బ‌లం ఏంటో నిరూపించుకుంటామ్నారు క‌ర్ణాట‌క సీఎం యడ్యూర‌ప్ప‌.

- Advertisement -