దేవేగౌడకు మోడీ,రాహుల్ ఫోన్..

219
Modi,Rahul greets Deve Gowda
- Advertisement -

కర్నాటక రాజకీయాలు తుది దశకు చేరుకున్నాయి. రేపు(శనివారం) సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీ కోర్టు గవర్నర్‌కు సూచించడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. సుప్రీం తీర్పుపై జేడీఎస్,కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. ఇదిఇలా ఉండగా ఇవాళ మాజీ ప్రధాని దేవేగౌడ 85వ పుట్టినరోజు.

ఈ సందర్భంగా పలువురు ప్రధానమంత్రి నరేంద్రమోడీ,కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రముఖులు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. మన మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ జీ తో మాట్లాడాను. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాను. ఆయన ఆరోగ్యం, జీవితం బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని మోడీ ట్విటర్‌ ద్వారా తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా మోడీ…దేవేగౌడ పై ప్రశంసలు గుప్పించారు.

రాహుల్ గాంధీ సైతం దేవేగౌడకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా జేడీఎస్ పార్టీపై, దేవెగౌడపై తాను చేసిన వ్యాఖ్యలపై రాహుల్ క్షమాపణలు కోరారు. కర్నాటక రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్న తరుణంలో వీరిద్దరు దేవేగౌడకు ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

1996 జూన్‌ 1 నుంచి 1997 ఏప్రిల్‌ 21 వరకు ప్రధాన మంత్రిగా పనిచేశారు దేవెగౌడ . పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు తీసుకున్నారు. దేవేగౌడ వెంట పెద్ద కుమారుడు రేవణ్ణ కూడా ఉన్నారు.

- Advertisement -