ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో పోలైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్లను వంద శాతం సరిచూసుకోవాలని చేసిన డిమాండ్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది.ఈవీఎంలు, వీవీప్యాట్లతో వంద శాతం క్రాస్ వెరిఫికేషన్ కుదరదని కోర్టు చెప్పింది.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి మార్పు ఉండబోదు అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈవీఎంలలో ఓట్లతో పాటు వీవీప్యాట్ల స్లిప్‌లను కూడా లెక్కించాలని సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలు కాగా ఆ పిటీషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఆ అభ్యర్థలను తోసిపుచ్చింది.
ఈవీఎంల స్థానంలో మళ్లీ పేపర్ బ్యాలెట్లను వాడాలన్న అభ్యర్థనను కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. వీవీప్యాట్ల ఫిజికల్ డిపాజిట్ కూడా కుదరదు అని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
Also Read:బొప్పాయితో ఆరోగ్య ప్రయోజనాలు..