సుదీర్ఘకాలం న్యాయవాదిగా పనిచేసి తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ విశ్వనాథన్ అత్యంత ధనవంతుడైన జస్టిస్‌గా నిలిచారు. రూ.120 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో పాటు పదేళ్లుగా రూ.91 కోట్ల ఆదాయపన్ను చెల్లించారు జస్టిస్ విశ్వనాథన్.
సుప్రీంకోర్టులో మొత్తం 33 మంది న్యాయమూర్తులు ఉండగా సోమవారం అర్థరాత్రికి సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో 21 మంది న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు పొందుపర్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ కన్నాకు బ్యాంక్ అకౌంట్లో రూ.55.75 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్స్ ఉండగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో రూ.1.06 కోట్లు ఉన్నాయి.
తదుపరి సీజేఐ కానున్న జస్టిస్ గవాయ్ కు బ్యాంక్ అకౌంట్లో రూ. 19.63 లక్షలు, పీపీఎఫ్ అకౌంట్ లో రూ.6.59 లక్షలు ఉన్నాయి. జస్టిస్ గవాయ్ కు మహారాష్ట్రలోని అమరావతి, నాగపూర్ లో వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములు, ఢిల్లీలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏప్రిల్ 1న జరిగిన సుప్రీంకోర్టు జడ్జెస్ ఫుల్ కోర్టు మీటింగ్ లో ఆస్తుల వివరాలు వెల్లడించాలని నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయం మేరకు సుప్రీంకోర్టు అధికారిక వెబ్ సైట్ లో వివరాలు పొందుపర్చారు.
Also Read:సమ్మెకే కార్మికుల మొగ్గు!

