సుప్రీంలో రవిప్రకాశ్‌కు చుక్కెదురు

308
tv9 ravi prakash
- Advertisement -

ఫోర్జరీ,డేటా చౌర్యం కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంను ఆశ్రయించిన రవిప్రకాశ్‌ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్ధానం కొట్టేసింది. దీంతో రవి ప్రకాశ్‌ ముందున్న అన్ని దారులు మూసుకుపోయాయి.

ఇక ఇప్పటికే రెండు సార్లు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన అక్కడ రవి ప్రకాశ్‌కు నిరాశే మిగిలింది. మరోవైపు రవిప్రకాశ్‌కోసం తెలంగాణ పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఐటీ యాక్ట్‌ 66 (సీ) 66 (డీ),72లతోపాటు, 406, 420, 467, 469, 471, 120 బీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రెండుసార్లు సీఆర్‌పీసీ సెక్షన్ల 160, సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసినా రవిప్రకాశ్, మరో నిందితుడు, సినీనటుడు శివాజీ పోలీసుల విచారణకు హాజరుకాలేదు.

ఇక ఏపీలోనూ రవి ప్రకాష్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 30 సిమ్ కార్డులు రవి ప్రకాష్ మార్చారని పోలీసులు గుర్తించారు.

- Advertisement -