నూతన సాగు చట్టాలు, రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంలో ఇప్పటికే కేంద్రం వైఖరిని తప్పుబట్టిన సుప్రీం….కొత్త వ్యవసాయ చట్టాల రద్దు అంశంపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అప్పటివరకు వ్యవసాయ చట్టాలపై స్టే విధిస్తున్నట్లు తెలిపిన అత్యున్నత న్యాయస్ధానం…తాము ఏర్పాటు చేయబోయే కమిటీకి రైతులు సహకరించాలని కోరింది. సమస్య పరిష్కారం కావాలి అంటే కమిటీ ముందు అభిప్రాయాలు తెలపాలని కోరింది.
నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయగా ఇందులో బీకేయూ అధ్యక్షుడు జితేందర్ సింగ్ మాన్, ఇంటర్నేషనల్ పాలసీ హెడ్ డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషీ, అగ్రికల్చరల్ ఎకానమిస్ట్ అశోక్ గులాటీ, శివకేరి సంఘటన మహారాష్ట్ర అధ్యక్షుడు అనిల్ ధనవత్‌లు ఉన్నారు. సుప్రీం ఏర్పాటు చేసిన కమిటీ అంశంపై రైతు సంఘాల నేతలు నిర్ణయం తీసుకోనున్నారు.
సుప్రీం ఆదేశించినా.. తాము మాత్రం నిరసన ప్రదేశాలను వదిలి వెళ్లమని రైతులు అన్నారు. గణతంత్య్ర దినోత్సవ రోజున ట్రాక్టర్ ర్యాలీ ఉంటుందని రైతులు పేర్కొన్నారు.నేటి నుంచి 10 రోజుల్లో పని ప్రారంభించాలని ఆదేశించిన సుప్రీం…కమిటీ పర్యటనలు.. ఇతర వ్యయాలను కేంద్రం భరించాలని ఆదేశించింది. రైతులు, రైతు సంఘాలు, ప్రభుత్వ ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరించాలని ఆదేశించింది. నివేదికను రెండు నెలల్లో సుప్రీంకోర్టుకు అందించాలని పేర్కొంది సర్కోన్నత న్యాయస్ధానం.