వివేకా హత్య కేసుపై సుప్రీం ధర్మాసనం

9
- Advertisement -

వివేకా హత్య కేసులో మూడు అంశాలపై సీబీఐ అభిప్రాయం కోరింది సుప్రీం ధర్మాసనం. సీబీఐ అభిప్రాయం చెప్పాక అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారిస్తామని తెలిపింది ధర్మాసనం. తదుపరి విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తుందా? లేదా? కోర్టుకు చెప్పాలని తెలిపింది ధర్మాసనం. ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో వేసిన క్లోజర్ రిపోర్టుపైనా అభిప్రాయం కోరింది సుప్రీం. క్లోజర్ రిపోర్టుపైనా సీబీఐ అభిప్రాయాన్ని కోరింది.

కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా? ,ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా అని కూడా సీబీఐ అభిప్రాయాన్ని కోరింది ధర్మాసనం. అవినాష్ రెడ్డితో పాటు పలువురు నిందితులకు తెలంగాణ హైకోర్టు గతంలో బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసందే.

Also Read:హాంకాంగ్‌లో తుఫాను బీభత్సం..

తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు సీబీఐ అధికరులు. జస్టిస్ ఎం.ఎం.సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరుగగా బెయిల్ పై ఉన్న నిందితులంతా సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ తరపు న్యాయవాది సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూథ్రా వాదించారు. ఏప్పీ ప్రభుత్వం వేసిన క్లోజర్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవాలని సీబీఐ అధికారి రాంసింగ్, సునీత దంపతులపై దాఖలైన కేసులో ఏపీ ప్రభుత్వం క్లోజర్ రిపోర్టు ఇచ్చింది.

- Advertisement -