వివేకా కేసు..సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు!

4
- Advertisement -

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఎంత మంది నిందితుల బెయిల్స్ రద్దు చేయాలో చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.సీబీఐ అధికారి రాంసింగ్‌తో పాటు వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై పెట్టిన కేసులను క్వాష్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

దర్యాప్తును ప్రభావితం చేసేందుకు అధికార దుర్వినియోగం చేసేందుకే ఈ కేసులు పెట్టినట్లుగా అర్థమవుతోందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో వాదించబోయిన లాయర్ పై అసహనం వ్యక్తం చేసింది. మీపై ఉన్న గౌరవంతోనే జరిమానా విధించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

Also Read:ఎమ్మెల్సీల అనర్హత..కీలక అంశాలు

తదుపరి దర్యాప్తు అవసరమా, నిందితుల కస్టోడియల్ విచారణ అవసరమా, ఎంత మంది నిందితుల బెయిల్ రద్దు చేయాలన్నది తదుపరి విచారణ నాటికి చెప్పాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. వచ్చే నెల 9 కి తదుపరి విచారణను వాయిదా వేసింది.

- Advertisement -