మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు దగ్గరపడుతుండగా, ఆయన సినిమాలపై అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక చిరు బర్త్ డే కానుగా విశ్వంభర టీజర్ రిలీజ్ కానుంది. అలాగే అనిల్ రావిపూడి సినిమా నుంచి మరో పెద్ద సర్ప్రైజ్ కూడా రానుంది.
ఈ రెండింటితో పాటు మూడో స్పెషల్ ట్రీట్ కూడా సిద్ధంగా ఉందని టాక్ వినిపిస్తోంది. దర్శకుడు బాబీ మరోసారి చిరంజీవితో జట్టుకట్టబోతున్నాడు. ఈసారి మెగాస్టార్‌ను పూర్తిస్థాయి గ్యాంగ్‌స్టర్ అవతారంలో చూపించనున్నట్లు సమాచారం. ఈ పాత్ర ఆయన స్క్రీన్‌పై నిప్పులు చెరుగుతుందని అభిమానులు నమ్ముతున్నారు.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను KVN ప్రొడక్షన్స్ అధిక బడ్జెట్‌తో నిర్మించబోతోంది. ఈ సినిమాను చిరంజీవి పుట్టినరోజు రోజునే లాంచ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
Also Read:ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి

