పెండింగ్ బిల్లులపై సుప్రీంలో విచారణ

52
supreme
- Advertisement -

రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై బిల్లులను ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనున్న నేపథ్యంలో ఆగమేఘాల మీద మూడు బిల్లులు ఆమోదం తెలిపారు గవర్నర్ తమిళి పై.

సుప్రీంకోర్టు మెప్పించేందుకే ఈ మూడు బిల్లులు ఆమోదం తెలపగా మిగత వాటిపై స్టడీ చేయాలని అందుకే నిర్ణయం తీసుకోలేదు ని సుప్రీంకోర్టు తెలిపే చేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు లో బిల్లుల అంశాలపై గవర్నర్ కు సూచనలు ఇవ్వనున్న నేపథ్యంలో ఇవాళ మూడు బిల్లులకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని చేర్చారు. బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం ప్రజాస్వామ స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షకు విరుద్ధమని ప్రభుత్వం వెల్లడించింది. గవర్నర్ వద్ద 10 బిల్లులు పెండింగ్‌లో ఉండగా ఆయా బిల్లులను గవర్నర్ పెండింగ్‌ లో పెట్టడానికి న్యాయమైన కారణాలు ఏవీ లేవని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులు నెలలు గడుస్తున్నా బిల్లులకు ఆమోదం లభించలేదని, దీంతో వేరే మార్గం లేకే ప్రత్యేక పరిస్థితుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -