పెగాసస్ స్పైవేర్ కేసులో సుప్రీం కీలకవ్యాఖ్యలు చేసింది. దేశ భద్రతపై రాజీపడొద్దు, నివేదికపై వీధుల్లో చర్చించడానికి వీల్లేదు అని తెలిపింది. నివేదికను అందరికీ బహిర్గతం చేయొద్దు.. దేశభద్రత కోసం స్పైవేర్ ఉపయోగిస్తే తప్పులేదు అని స్పష్టం చేసింది.
స్పైవేర్ ఎవరిపై ఉపయోగిస్తున్నారనేదే ప్రశ్న.. దేశ భద్రత విషయంలో రాజీపడలేం.. ఉగ్రవాదుల గోప్యత హక్కులను పొందలేరు.. సామాన్య పౌరుల గోప్యతను రాజ్యాంగం ప్రకారం పరిరక్షిస్తాం అని తేల్చిచెప్పింది సుప్రీం.
న్యాయమూర్తులు సూర్యకాంత్ మరియు ఎన్. కోటిశ్వరరావుల బెంచ్ ఈ కేసును విచారించింది. పెగాసస్ అనే ఇజ్రాయెలీ స్పైవేర్‌ను రాజకీయవేత్తలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై నిఘా కోసం ఉపయోగించారన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు ఈ సందర్భంగా పరిశీలించింది.
Also Read:అలా అయితే పాకిస్తాన్‌కే వెళ్లండి:పవన్
దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని ప్రభావితం చేసే ఏ నివేదికనైనా బయటకు వీలులేదు. కానీ ఎవరైనా వ్యక్తిగతంగా తమపై నిఘా జరిగిందా అని తెలుసుకోవాలనుకుంటే, ఆ సమాచారాన్ని వారికి చెప్పొచ్చు. వ్యక్తిగత అనుమానాలను తీర్చాల్సిన అవసరం ఉంది కానీ ఆ నివేదికను వీధుల్లో చర్చించేందుకు పత్రంగా మార్చకూడదు అని బెంచ్ పేర్కొంది.

