నీట్ ప్రశ్నా పత్రాల లీకేజీపై సుప్రీం కీలక ఆదేశం

15
- Advertisement -

నీట్ – యూజీ 2024 ప్రశ్నాప్రత్రాల లీకేజీపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం… విద్యార్థులు సాధించిన మార్కులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఆదేశించింది. అయితే, విద్యార్థుల గుర్తింపును గోప్యంగా ఉంచాలని సూచించింది. తదుపరి విచారణను 22కి వాయిదా వేశారు.

పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తేనే రీటెస్ట్‌కు ఆదేశించగలమని సీజేఐ చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్లకు వచ్చిన కనీస మార్కులపై సమాచారం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. 131 మంది విద్యార్థులు మాత్రమే రీటెస్ట్‌ కోరుతున్నారని.. సామాజిక పరిణామాల దృష్ట్యా నీట్ పరీక్షకు సంబంధించిన పిటిషన్ల విచారణకు తాము ప్రాధాన్యం ఇస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు.

మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి? పిటిషన్లు వేసిన విద్యార్థులు పొందిన కనీస మార్కులు ఎన్ని? అసలు ఎంతమంది విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు? అంటూ సీజేఐ ప్రశ్నించారు.

Also Read:CM Revanth:రుణమాఫీ నిధులు విడుదల..

- Advertisement -