- Advertisement -
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం,శివసేన పార్టీ గుర్తింపు పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయడంపై ఆగస్టు 8 న నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు వెల్లడించింది.
తమను నిజమైన శివసేన పార్టీగా గుర్తించడం కోసం షిండే గ్రూపు చేసిన అభ్యర్థనపై ఎటువంటి ముందస్తు చర్య తీసుకోవద్దని ఎన్నికల సంఘాన్ని మౌఖికంగా కోరింది సుప్రీంకోర్టు. దీనిపై ఠాక్రే వర్గం ప్రతిస్పందన తెలపడానికి సమయం కోరితే, వారి అభ్యర్థన పరిగణలోకి తీసుకుని, వారి వాదన విన్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
- Advertisement -