- Advertisement -
డీలిమిటేషన్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి.
డీలిమిటేషన్‌పై దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం. 2026లో జరిగే జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
Also Read:అశ్లీల కంటెంట్..ఈ యాప్‌లపై నిషేధం
అంతేగాదు తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన పిటిషన్‌ను కొట్టేసింది సుప్రీంకోర్టు. జమ్మూ కాశ్మీర్లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టారని పిటిషన్లో తెలిపారు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి. ఈ పిటిషన్‌ను అనుమతిస్తే ఇతర రాష్ట్రాల వాళ్ళ పిటిషన్లు వరదల్లా వస్తాయని డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు.
- Advertisement -

