షహీన్భాగ్ నిరసనల గురించి చర్చించాలంటే ప్రశాంత వాతావరణం ఉండాలని అభిప్రాయపడింది సుప్రీం కోర్టు. ప్రస్తుతం ఎన్నో పెద్ద అంశాలను పరిశీలనకు ఉన్నాయని, రెండు వర్గాలు బాధ్యతతో వ్యవహరించాలని జస్టిస్ కౌల్ అన్నారు. పోలీసుల్లో ప్రొఫెషనలిజం కొరవడిందని…చట్టం ప్రకారం పోలీసులు వ్యవహరిస్తే, ఇలాంటి ఎన్నో సమస్యలు ఉత్పన్నం కావన్నారు.
ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లపై సమగ్ర స్థాయిలో సమీక్ష నిర్వహించినట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఈశాన్య ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు పోలీసులు, ఇతర ఏజెన్సీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. అన్ని వేళలా శాంతిని, సామరస్యాన్ని కాపాడాలని ఢిల్లీలోని సోదర, సోదరీమణులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ట్విట్టర్లో తెలిపారు.
సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలు, ఘర్షణలను సోనియాగాంధీ ఖండించారు. ఢిల్లీలో అల్లర్ల ఘటనలు బాధాకరమని …ఈశాన్య ఢిల్లీలో అల్లర్లకు కేంద్రమే బాధ్యత వహించాలి..కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సోనియా డిమాండ్ చేశారు.