Supreme Court: బుల్డోజర్ జస్టిస్‌ చట్ట విరుద్దం

2
- Advertisement -

బుల్డోజర్ జస్టిస్‌ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పలు కేసుల్లో ఉన్న నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం తగదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నిందితుల ఇళ్లను కూల్చడం హక్కులను కాలరాయడమేనని తెలిపింది. ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలనేది ఒక కల అని.. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి చట్టబద్ధమైన పాలన పునాది. ఈ సమస్య నేర న్యాయ వ్యవస్థలో న్యాయానికి సంబంధించినది.. చట్టపరమైన ప్రక్రియ నిందితుల నేరాన్ని ముందస్తుగా నిర్ధారించకూడదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

నేరాలకు పాల్పడిన వ్యక్తులపై బుల్డోజర్ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం. ఇళ్లను కూల్చడం అంటే నివసించే హక్కును కాలరాయడమేనని..అధికారులే కోర్టుల పాత్ర పోషించడం సరికాదని చెప్పింది.

న్యాయవ్యవస్థ స్థానాన్ని పాలనావ్యవస్థ భర్తీ చేయలేదని తెలిపింది. నిష్పాక్షిక విచారణ పూర్తికాకుండానే నిందితుడిని దోషిగా పరిగణించలేమని.. దోషిగా నిర్థారించినా చట్ట ప్రకారమే శిక్ష ఉంటుందని స్పష్టంచేసింది.

Also Read:TTD:18న కార్తీక దీపోత్సవం

- Advertisement -