కమల్ అక్షర నివాళి

51
- Advertisement -

గురువారం రాత్రి లెజెండరీ దర్శకుడు కే విశ్వనాథ్ గారు తుదిశ్వాస విడిచారు. కె విశ్వనాథ్‌కు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల నుండి హృదయపూర్వక నివాళులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కమల్ సోషల్ మీడియా ద్వారా కె విశ్వనాథ్ గారికి లెటర్ ద్వారా నివాళి అర్పించాడు. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో సాగర సంగమం, స్వాతి ముత్యం మరియు శుభ సంకల్పం వంటి నటించిన కమల్ హాసన్ లెజెండ్‌కు అక్షరాలతో నివాళులర్పించారు.

కమల్ తన నివాళులర్పణకు “సాల్ట్ టు ఎ మాస్టర్” అని క్యాప్షన్ ఇచ్చారు. “కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు జీవిత పరమార్థాన్ని, కళలోని అమరత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. అందువల్ల అతని కళ అతని జీవితం కాలం మనం గుర్తుచేసుకునేలా ఉంటుంది. అతని కళతో చిరకాలం జీవించండి” అని కమల్ తన చేతితో రాసిన నోట్‌లో చివర్లో కె విశ్వనాథ్‌కి తాను వీరాభిమానిగా పేర్కొన్నాడు.

కమల్ ఇటీవల హైదరాబాద్ వచ్చి విశ్వనాథ్ ఆశీస్సులు అందుకున్నారు. చాలా సేపు ఆయనతో గడిపి వెళ్లారు. దీంతో కమల్ కి ఆ మీటింగ్ ఓ చివరి జ్ఞాపకంలా మిగిలింది.

ఇవి కూడా చదవండి…

విశ్వనాథ్ గారి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

కళాతపస్వి…’ఎస్’ లెటర్ సినిమాలు

లెజెండ్ కె.విశ్వనాథ్ మరణానికి.. కారణం అదే!

- Advertisement -