Supreme Court: మనీష్ సిసోడియాకు బెయిల్

11
- Advertisement -

ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. విచారణ ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది. బెయిల్ సందర్భంగా సాక్ష్యులను ప్రభావితం చేయవద్దని, పాస్ పోర్టు సరెండర్ చేయాలని సిసోడియాను ఆదేశించింది న్యాయస్థానం. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె వి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

విచారణ వేగవంతంగా జరగాలని కోరడం పిటీషనర్ హక్కు..ట్రయల్ కోర్టు, హైకోర్టు అంశానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందన్నారు. సిసోడియాను మళ్లీ ట్రయల్ కోర్టుకు పంపడమంటే న్యాయాన్ని అప హాస్యం చేయడమేనని తెలిపారు న్యాయమూర్తులు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గత ఏడాది ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయగా జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే గత ఏడాది మార్చి 9న ఈడీ ఆయనను అదుపులోకి తీసుకుంది. అప్పటి నుండి 17 నెలలుగా జైలులోనే ఉన్నారు సిసోడియా.

Also Read:Paris Olympics: నీరజ్ చోప్రాకు రజతం

- Advertisement -