కేజ్రీవాల్‌కు సుప్రీంలోనూ నిరాశే

15
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. సుప్రీం కోర్టులో బెయిల్‌పై ఊరట దక్కలేదు. ట్రయల్ కోర్టు తనకు మంజూరు చేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు విధించిన స్టేని ఎత్తివేయాలని సుప్రీంను ఆశ్రయించారు కేజ్రీవాల్.

కేజ్రీవాల్‌ పిటిషన్‌పై ఈ నెల 26న విచారిస్తామని..హైకోర్టు ఆదేశాలు వచ్చే వరకూ వేచి చూడాలని స్పష్టం చేసింది. కేజ్రీవాల్‌కు అనుకూలంగా బెయిల్ ఉత్తర్వులు ఉన్నాయని.. ఆయన విదేశాలకు పారిపోయే ప్రమాదం కూడా లేదని అభిషేక్ సింఘ్వీ తన వాదనలు వినిపించారు.

లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 20న రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయగా దీనిని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది ఈడీ. కేజ్రీవాల్ బెయిల్‌పై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. దీంతో సుప్రీంను ఆశ్రయించారు కేజ్రీవాల్.

Also Read:ఆతిథ్య విండీస్‌కు షాక్‌..సెమీస్‌లో సౌతాఫ్రికా

- Advertisement -