కాంగ్రెస్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చెంపదెబ్బ!

5
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అప్రజాస్వామిక, నిరంకుశ పాలనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఈరోజు న్యాయం గెలిచింది.. సోషల్ మీడియా కేసుల విషయంలో రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది.సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి, గొంతు నొక్కాలని చూస్తున్న రేవంత్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో భారీ పరాభవం ఎదురైంది.

గత ఏడాది బీఆర్ఎస్ పార్టీ అధికారిక ఖాతాలోని ఒక పోస్ట్‌ను కేవలం ‘రీట్వీట్’ చేసినందుకు శశిధర్ గౌడ్ అనే సోషల్ మీడియా వారియర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసు నమోదు చేసింది. నల్లబాలును ఏకంగా 20 రోజుల పాటు జైల్లో బంధించి వేధించింది. ఈ అక్రమ కేసును గత సెప్టెంబర్‌లోనే తెలంగాణ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అరెస్టును కొట్టివేయడమే కాకుండా, సోషల్ మీడియా కేసుల విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని, ఇష్టారాజ్యంగా కేసులు పెట్టకూడదని మార్గదర్శకాలు జారీ చేసింది.

హైకోర్టు తీర్పును గౌరవించాల్సింది పోయి, తెలంగాణ ప్రభుత్వం అహంకారంతో పట్టుదలకు పోయింది. దాదాపు రూ. 10 లక్షల ప్రజాధనాన్ని ఖర్చు చేసి, సీనియర్ అడ్వకేట్లను పెట్టి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లింది. నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌లో ఎలాంటి పస లేదని తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో రీట్వీట్ చేయడం నేరం కాదని స్పష్టం చేస్తూ, ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టివేసింది.ఒకవైపు దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని చేతబూని, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి సుద్దులు చెప్పే రాహుల్ గాంధీ గారు.. తెలంగాణలో తన పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఈ అణచివేతపై ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలి. ఈ తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక మేలుకొలుపు.. పోలీసులను అడ్డం పెట్టుకుని, అక్రమ కేసులతో ప్రతిపక్షాన్ని, ప్రశ్నించే గొంతుకలను భయపెట్టాలని చూస్తే న్యాయస్థానాల సాక్షిగా పరాభవాలు తప్పవు.

Also Read:ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని రద్దు చేయాలి!

- Advertisement -