శబరిమలపై సుప్రీం కీలకతీర్పు..

512
supreme court sabarimala
- Advertisement -

అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శబరిమల ఆలయ బోర్డు రూపకల్పన చేయాలని ఆదేశాలు జారీచేసింది సుప్రీంకోర్టు. ఇందుకోసం ప్రత్యేక చట్టం చేయాలని కేరళ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. జనవరి 3వ వారంలోపు కొత్త చట్టాన్ని కోర్టుకు సమర్పించాలని జస్టిస్‌ ఎన్వీ రమణ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

ఆలయ నిర్వాహణ విషయంలో టీటీడీ బోర్డు అనుసరిస్తున్న విధానాన్ని అనుసరించాలని తెలిపింది. భారీ ఎత్తున్న వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అయ్యప్ప దేవాలయాన్ని ప్రత్యేకంగా పరిగణించాలని సూచించింది. మహిళలకు ఆలయ ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పు వర్తిస్తుందని వెల్లడించింది.

2011లో ఆలయంలో తొక్కిసలాట జరిగి 106 మంది భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  కొత్త చట్టం తీసుకురావాలని సూచించింది.

Supreme Court has given the Kerala government four weeks to draft an exclusive law for the management of Sabarimala Temple.

- Advertisement -