కంచ గచ్చిబౌలి ఫారెస్ట్‌ను పునరుద్దరించండి

7
- Advertisement -

కంచ గచ్చిబౌలి ఫారెస్ట్‌ను పునరుద్ధరించకపోతే అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అని తెలిపింది సుప్రీం కోర్టు. కంచ గచ్చిబౌలి కేసు విషయంలో మరోసారి అధికారులకు చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు.

కంచ గచ్చిబౌలి భూముల కేసు పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది అని తెలిపింది న్యాయస్థానం. రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టి ఫారెస్టును క్లియర్ చేద్దామనుకున్నారు… కంచ గచ్చిబౌలి ఫారెస్ట్‌ను పునరుద్ధరించకపోతే అక్కడ తాత్కాలిక జైలు కట్టి.. అధికారులను జైల్లో పెట్టక తప్పదు అని తెలిపారు చీఫ్ జస్టిస్. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది.

కంచ గచ్చిబౌలి భూముల కేసులో అఫిడవిట్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ అఫిడవిట్ పై సమాధానం చెప్పేందుకు సమయం కోరారు ప్రతివాదులు. ప్రతివాదుల విజ్ణప్తి మేరకు తదుపరి విచారణను ఆగస్టు 13కి వాయిదా వేసింది సీజేఐ జస్టిస్ గవాయ్ ధర్మాసనం.

Also Read:సినిమాల కంటే రాజకీయాలే ముఖ్యం!

- Advertisement -