- Advertisement -
కోహినూర్ వజ్రం చుట్టూ హరిహర వీరమల్లు సినిమా కథ నడుస్తుంది అని తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమాలో ఔరంగజేబు అరాచకాలను ఎదిరించే పాత్ర చేస్తున్నట్లు తెలిపారు.
చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి కొంత వర్క్ అవుట్ చేశాం అన్నారు. సినిమాలో ఎలాంటి రాజకీయ అంశాలు లేవు…. సినిమాల కంటే రాజకీయాలకే నా ప్రాధాన్యత అన్నారు. జనసేన పార్టీ నిర్మాణంపై ఇప్పటివరకు నేను దృష్టి పెట్టలేదు అన్నారు పవన్.
ఇకపై పార్టీ సంస్థాగత నిర్మాణంపై పని చేస్తాను…. రాజధాని భూసేకరణలో ఇష్టం ఉన్న రైతులే భూములు ఇవ్వండి, బలవంతం లేదు అన్నారు. నాగబాబుకు మంత్రి పదవిపై ఇప్పటి వరకు చర్చ జరగలేదు… దానిపై నేనే నిర్ణయం తీసుకోవాలి అన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు తప్పవు అన్నారు.
Also Read:గ్రీన్ ఛాలెంజ్..8వ ఎడిషన్
- Advertisement -

