- Advertisement -
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ఈడీ) పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈడీ రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఈడీ అధికారులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు జస్టిస్ గవాయి.
ప్రభుత్వ మార్కెటింగ్ కార్పొరేషన్ సంస్థపై ఈడీ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది తమిళనాడు ప్రభుత్వం. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపి, ఒక ప్రభుత్వ సంస్థను దోషిగా ఎలా చిత్రీకరిస్తారంటూ ఈడీని నిలదీశారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి.
Also Read:కేసీఆర్ కట్టిన సచివాలయం అద్భుతం:జగన్
- Advertisement -

