పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ మ్యాసివ్ యాక్షనర్ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అలాంటి వారికి హనుమాన్ జయంతి సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది అని తెలిపారు.ఈ ప్రకటనతో పాటు పవన్ కల్యాణ్‌కి చెందిన ఒక క్యాండిడ్ ఫోటోను కూడా పంచుకున్నారు . ఆ ఫోటోలో ఆయన లార్డ్ హనుమాన్ పెండెంట్ ధరించి, హరీష్ శంకర్ చేతిని పట్టుకున్నట్లు కనిపించారు.
ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గబ్బర్ సింగ్ జోడీ మళ్లీ కలవడం వలన ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
Also Read:కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు

