దేశంలో కరోనా సెకండ్ తీవ్రరూపం దాల్చుతోంది. రోజుకు రికార్డు స్ధాయిలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో లాక్డౌన్ అంశంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
లాక్డౌన్ వల్ల తలెత్తే సామాజిక, ఆర్థిక ఇబ్బందుల గురించి మాకు అవగాహన ఉంది. ముఖ్యంగా పేదలు ఎదుర్కొనే కష్టాల గురించి తెలుసు. ఒకవేళ లాక్డౌన్ విధించినట్టయితే ఈ వర్గాల అవవసరాలు తీర్చడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలి అని ధర్మాసనం సూచించింది.కోవిడ్‌ను సూపర్‌స్ప్రెడర్‌గా వ్యాపింపజేసే సామూహిక సమావేశాలు, సభలు వంటి కార్యక్రమాలపై కఠిన నిషేధం విధించాలని పేర్కొంది.
కరోనా బారిపడ్డ వైద్య సిబ్బందికీ సరైన పడకలు, ఆక్సిజన్, అత్యవసర ఔషధాలు దొరకడం లేదని తెలిసింది. ప్రాణాలు పణంగా పెట్టి సేవలను చేస్తున్న వైద్యులను గుర్తించేందుకు వీలుగా జాతీయస్థాయిలో ఒక విధానం రూపొందించాలని పేర్కొంది.