పుర పోరులో కారు జోరు…

46
trs

రాష్ట్రంలో జరిగిన రెండు కార్పొరేషన్,5 మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు దూసుకుపోతోంది. స్పష్టమైన ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయబావుటా ఎగురవేస్తున్నారు. నకిరేకల్‌ మున్సిపాలిటీలో ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ ఏడు వార్డుల్లో విజయం సాధించింది. 2, 7, 10,11,13, 17, 19 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. కాగా 1వ వార్డులో కందాల బిక్షంరెడ్డి(స్వతంత్ర అభ్యర్థి) గెలుపొందారు.

ఖమ్మం కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ దూసుకుపోతోంది. కార్పొరేషన్‌లోని 1, 13, 25, 37వ డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. కొత్తూరు మున్సిపల్‌ ఎన్నికల్లో రెండు వార్డుల్లో విజయం సాధించగా సిద్దిపేట పోస్టల్‌ బ్యాలెట్లలో టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం కనబర్చింది. టీఆర్‌ఎస్‌-44, బీజేపీ-2, ఇతరులకు 3 ఓట్లు వచ్చాయి.