ఆన్‌లైన్‌ క్లాసులైతే ఫీజులు తగ్గించాల్సిందే: సుప్రీం

125
Supreme Court
- Advertisement -

కేవ‌లం ఆన్‌లైన్ క్లాసులే అయితే క‌చ్చితంగా ఫీజులు త‌గ్గించాల్సిందే అని స్ప‌ష్టం చేసింది సుప్రీం కోర్టు. ఆన్ లైన్ క్లాసుల పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుండి లక్షల ఫీజులు వసూలు చేస్తుండగా దీనిని తీవ్రంగా పరిగణించింది సుప్రీం.

ఆన్‌లైన్ క్లాస్‌ల కార‌ణంగా స్కూలు నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు త‌గ్గాయి కాబ‌ట్టి ఆ ప్ర‌యోజ‌నాన్ని త‌ల్లిదండ్రుల‌కు బ‌దిలీ చేయాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం చెప్పింది. స్కూలు యాజ‌మాన్యాలు తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోవాల‌ని, ఆమేరకు వారికి ఉప‌శ‌మ‌నం క‌లిగించాల‌ని ఆదేశించింది.

గ‌తేడాది లాక్‌డౌన్ కార‌ణంగా చాలా కాలం స్కూళ్లు తెర‌వలేదు. దీని కార‌ణంగా పెట్రోల్‌/డీజిల్‌, క‌రెంటు, నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు, నీటి ఛార్జీలు, స్టేష‌న‌రీ ఛార్జీలు వంటివి మిగిలిపోయాయి. వీటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి అని సుప్రీం ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.

- Advertisement -