Supreme Court:నీట్ లీకేజీ వాస్తవమే కానీ!

15
- Advertisement -

నీట్ పరీక్ష లీకేజీ వాస్తవమేనని తేల్చింది సుప్రీం కోర్టు. అయితే నీట్‌-యూజీ పరీక్ష ను మళ్లి నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే ఈ లోపం వల్ల కేవలం 155 మంది అభ్యర్థులు లబ్ధి పొందారని చెప్పారు.

లబ్ది పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని కానీ అదే కారణంతో మిగతా అభ్యర్థులందరికీ తిరిగి పరీక్ష నిర్వహించాల్సిన అసవరం లేదని వెల్లడించింది. నీట్‌ పేపర్‌ లీకేజీ ద్వారా పరిమిత సంఖ్యలో మాత్రమే అభ్యర్థులు లబ్ధి పొందారని, ఆ లబ్ధిపొందిన అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. పరీక్ష తిరిగి నిర్వహిస్తే మొత్తం 24 లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందుల పాలవుతారని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.

Also Read:సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఆపరేషన్ రావణ్

- Advertisement -