కోవిడ్-19తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం కేంద్రం కొత్త పథకం రూపొందిస్తుంది. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య. 18 ఏళ్లు నిండాక నెలవారీ స్టైపెండ్, 23 ఏళ్లు నిండాక రూ. 10 లక్షలు పీఎం-కేర్స్ నుంచి ఇచ్చేలా స్కీమ్ రూపొందించింది.అంతేకాదు ఉన్నత చదువుల కోసం రుణం, దానిపై వడ్డీ పీఎం-కేర్స్ నుంచి చెల్లింపు చేస్తుంది. అలాగే పిల్లలకు 18 ఏళ్లు వచ్చేవరకు రూ. 5 లక్షల విలువైన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఆరోగ్య బీమా, ఇందుకు పీఎం-కేర్స్ నుంచే ప్రీమియం చెల్లింపు చేయనుంది.
పిల్లలు దేశ భవిష్యత్తు అని, వారికి భద్రత, సహాయం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఈమేరకు ప్రధాని మోదీ వెల్లడించారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలవాలని నిర్ణయం తీకున్నమని..అలాంటి చిన్నారుల భవిష్యత్తుపై భరోసా కల్పించడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని వెల్లడించారు.